: 2013లో మన చోరశిఖామణుల చేతివాటం రూ. 13వేల కోట్లు


నమ్మలేకపోయినా ఇది నిజం. 2013లో భారతదేశంలో ఏకంగా రూ. 13,219 కోట్ల ఆస్తులను చోరశిఖామణులు కొల్లగొట్టారు. గత దశాబ్ద కాలంలో పోయినేడాది దొంగతనాలు రెండో స్థానంలో నిలిచాయి. అయితే పోలీసులు మాత్రం కేవలం రూ. 1762 కోట్లను మాత్రమే రికవర్ చేయగలిగారు. ఈ వివరాలను నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్ సీఆర్ బీ) వెల్లడించింది. పోలీసులు ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నప్పటికీ... దొంగలు కూడా ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తున్నారు.

  • Loading...

More Telugu News