: సచిన్ తెలియకపోతే తప్పా?... గుత్తా జ్వాల వివాదాస్పద వ్యాఖ్యలు
"సచినా? అతనెవరో నాకు తెలియదు" అంటూ టెన్నిస్ స్టార్ షరపోవా చేసిన వ్యాఖ్యలు రేపిన దుమారం అంతా ఇంతా కాదు. అదింకా సద్దుమణగక ముందే భారత షట్లర్ గుత్తా జ్వాల దీనికి మరింత ఆజ్యం పోసింది. సచిన్ తెలియకపోవడంలో తప్పేముంది? అని ప్రశ్నించింది. షరపోవా వ్యాఖ్యలను అనవసరంగా వివాదాస్పదం చేస్తున్నారని వెనకేసుకొచ్చింది. క్రికెట్ కేవలం 12 దేశాల్లో మాత్రమే ఆడతారని... అమెరికన్లకయితే అసలు క్రికెట్ అంటేనే తెలియదని తెలిపింది. అదే టెన్నిస్ అయితే 200 దేశాల్లో, బ్యాడ్మింటన్ 150 దేశాల్లో తెలుసని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో సచిన్ తెలవదని షరపోవా అనడం తప్పేమీ కాదని స్పష్టం చేసింది. మరి, ఈ వ్యాఖ్యలు ఎలాంటి దుమారం రేపుతాయో వేచి చూడాలి.