: ఉత్తరాంధ్ర, తెలంగాణల్లో రెండ్రోజుల పాటు వర్షాలు
నేడు, రేపు రెండ్రోజులపాటు ఉత్తరాంధ్ర, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర మీద ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీనికి తోడు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఆవరించి ఉంది. ఈ నేపథ్యంలో, రుతుపవనాల్లో కదలిక వచ్చిందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న రాత్రి గన్నవరంలో 12 మి.మీ, అనంతపురం, రామగుండంలో 6 మి.మీ, కర్నూలులో 4 మి.మీ వర్షపాతం నమోదయింది.