: బాలుడి కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు


హైదరాబాదులో బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. జగద్గిరిగుట్టలో కిడ్నాపునకు గురైన మూడేళ్ల బాలుడు ప్రభు ఆచూకీని కనుగొన్న పోలీసులు, తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. బాలుడి తల్లి పనిచేేసే ఇంటి యజమానులే కిడ్నాప్ కు పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలింది. ఈ నెల 2వ తేదీన బాలుడిని కరీంనగర్ లో అమ్మివేశారు. బాలుడిని అపహరించిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలుడు క్షేమంగా ఇంటికి చేరడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News