: వచ్చే 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు
రాగల 48 గంటల్లో కోసాంధ్ర, తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరిలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. కృష్ణాజిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని ఆ శాఖ తెలిపింది. కాకినాడ, తాడేపల్లిగూడెంలో 3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆళ్లగడ్డ, గుత్తిలో, తుని, ప్రత్తిపాడు, పోలవరంలో 2 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. నెల్లూరు, ఇచ్ఛాపురం, విశాఖ, తిరువూరులో సెం.మీ. చొప్పున వర్షం కురిసింది.