: ప్రకాశం జెడ్పీ ఛైర్మన్ గా ఈదర హరిబాబు ఎన్నిక
ప్రకాశం జెడ్పీ ఛైర్మన్ గా స్వతంత్ర అభ్యర్థి ఈదర హరిబాబు ఎన్నికయ్యారు. ఈదర హరిబాబు అభ్యర్థిత్వాన్ని వైఎస్సార్సీపీ సభ్యులు బలపరిచారు. ఈదరకు 28 ఓట్లు పోలయ్యాయి. ఇక, టీడీపీ తరఫున బరిలోకి దిగిన మన్నె రవీంద్రకు 27 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీకి దిగిన ఈదర హరిబాబు ఒక్క ఓటు తేడాతో జెడ్పీ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.