: అమ్మా బైలెల్లినాదో... తల్లీ బైలెల్లినాదో!
సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఆలయంలో ఆషాఢ జాతర (బోనాల పండుగ) అంగరంగ వైభవంగా జరుగుతోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ ఎంపీ కవిత, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి, తెలంగాణ మంత్రులు ఈటెల రాజేందర్, పద్మారావు, టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.