: నెల్లూరు జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక వాయిదా
నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో జెడ్పీ ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారానికి సంబంధించి కలెక్టర్ సభ్యులను సంతకాలు చేయాల్సిందిగా కోరారు. వైఎస్సార్సీపీ తరఫున 22 మంది సభ్యులు సంతకాలు చేశారు. కాగా, టీడీపీ సభ్యులు సంతకాలు చేయకుండా బహిష్కరించారు. దీంతో కోరం లేకపోవడంతెో జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.