: ఇందుకూరు జెడ్పీటీసీని దూరంగా ఉంచిన వైకాపా


నెల్లూరు జెడ్పీటీసీ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా మారింది. సమావేశ మందిరంలో ఇరు పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. ఇందుకూరు జెడ్పీటీసీ వెంకటరామయ్యను వైకాపా దూరంగా ఉంచింది. ఓటింగ్ కు ఆయనను వైకాపా తీసుకురాలేదు. టీడీపీకి వెంకటరామయ్య మద్దతు తెలిపే అవకాశం ఉందని వైకాపా భావిస్తోంది. ఇదే సమయంలో, తమకు మద్దతిస్తున్న వైకాపా సభ్యులను తమవైపే కూర్చోబెట్టాలని టీడీపీ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో, కలెక్టర్ మాట్లాడుతూ... ఏ పార్టీ సభ్యులను ఆ పార్టీ స్థానంలోనే కూర్చోబెడతామని... ఓటింగ్ సమయంలో మాత్రం ఎవరికి నచ్చినట్టు వారు ఓటు వేయవచ్చని సూచించారు.

  • Loading...

More Telugu News