: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ నేడే
ప్రపంచవ్యాప్తంగా ఫుట్ బాల్ అభిమానులను ఉర్రూతలూగించిన ఫిపా వరల్డ్ కప్ చివరి అంకానికి చేరుకుంది. భారత కాలమానం ప్రకారం ఈ అర్ధరాత్రి 12.30 గంటలకు ఫైనల్స్ జరగనుంది. టైటిల్ కోసం అర్జెంటీనా, జర్మనీలు తలపడుతున్నాయి. ఒకవైపు బలమైన జర్మనీ, మరోవైపు ఫుల్ ఫామ్ లో ఉన్న అర్జెంటీనా. అయితే విజయం తమదేనని జర్మన్ కోచ్ జోచిమ్ ఆత్మ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. అమెరికాల్లో (ఉత్తర, దక్షిణ) ఇప్పటి వరకు ఎనిమిది వరల్డ్ కప్ లు జరిగినా... ఇంతవరకు ఒక్క యూరోపియన్ జట్టు కూడా ఇక్కడ టైటిల్ గెలవలేదు. అయితే, ఈసారి గెలిచి చరిత్రను తిరగరాస్తామని జర్మన్ కోచ్ అంటున్నాడు. మరి మెస్సీ మాయాజాలం ముందు జర్మనీ తన కలను సార్థకం చేసుకుంటుందా? వేచి చూడాల్సిందే.