: మహబూబ్ నగర్ జిల్లాలో 120 గ్రామాలకు నిలిచిన తాగునీటి సరఫరా
మహబూబ్ నగర్ జిల్లాలోని 120 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. నాగర్ కర్నూలు, అచ్చంపేట, బిజినేపల్లి, కొత్తకోట, గోపాల్ పేట, ఎల్కపల్లి, కోడేరు మండలాల్లోని గ్రామాలకు నీటి సరఫరా ఆగిపోయింది. జిల్లాలోని రామన్ పాడు తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని సమ్మెకు దిగారు. గత నెలలో కూడా వీరు సమ్మె చేశారు. అయితే జులై 5న జీతాలిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. కానీ, హామీ మేరకు జీతాలు ఇవ్వకపోవడంతో మరోసారి సమ్మెకు దిగారు. దీంతో ఈ గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది.