: మార్కాపురం జడ్పీటీసీ రంగారెడ్డి (వైకాపా) అరెస్ట్... సర్వత్ర ఉత్కంఠ
ప్రకాశం జిల్లా మార్కాపురం వైకాపా జడ్పీటీసీ రంగారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ఆయన అరెస్ట్ సంచలనం సృష్టిస్తోంది. ఇడుపులపాయ నుంచి ప్రత్యేక బస్సులో ఒంగోలు బయల్దేరిన 28 మంది వైకాపా జడ్పీటీసీలను సంతమాగులూరు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. రంగారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పాత కేసుల నేపథ్యంలోనే రంగారెడ్డిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం టీడీపీ, వైకాపాలకు చెరో 28 మంది సభ్యుల చొప్పున సమాన బలం ఉంది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి ఓటు వైకాపాకు అత్యంత కీలకం. ఆయన అరెస్టుతో వైకాపా బలం 27కు పడిపోతుంది. టీడీపీకి 28 మంది సభ్యుల బలం ఉంటుంది. ఈ నేపథ్యంలో, రంగారెడ్డి అరెస్ట్ అందర్లోనూ ఉత్కంఠ రేపుతోంది.