: అర్జెంటీనా గెలిస్తే నా భర్తను వారం రోజులు పాప్ సింగర్ కి అప్పిస్తా
టీమిండియా ప్రపంచకప్ గెలిస్తే నగ్నంగా పరుగెడతానంటూ బాలీవుడ్ పూనంపాండే ప్రకటించి సంచలనం రేపగా, ‘ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన బాలికల్ని విడిచిపెడితే నేను వారితో గడిపేందుకు సిద్ధం, రోజుకు ఆరుగురైనా పర్లేదు’ అంటూ ఓ పాప్ సింగర్ ప్రకటించి తన పెద్దమనసు చాటుకుంది. తాజాగా వారి జాబితాలో అర్జెంటీనా గోల్ కీపర్ సెర్గియో రొమెరో భార్య ఎలియానా గుయెర్సియో చేరింది. అర్జెంటీనా ప్రపంచకప్ గెలుచుకుంటే తన భర్తను వారం రోజుల పాటు పాప్ సింగర్ కి అరువుగా ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చింది. సెమీఫైనల్ లో నెదర్లాండ్స్ ఆటగాళ్ల ఫ్రీకిక్ లను గోల్ కాకుండా రొమెరో సమర్థవంతంగా అడ్డుకున్నాడు. సెమీస్ ను చూసిన ఓ పాప్ సింగర్ అతగాడి ఆటతీరుపై ముచ్చటపడి, అతడ్ని ప్రశంసలతో ముంచెత్తింది. దీంతో రొమెరో భార్య అర్జెంటీనా గెలిస్తే ఆ పాప్ సింగర్ కి వారం రోజుల పాటు తన భర్తను అప్పిస్తానని ట్వీట్ చేసింది. ఇదిప్పుడు నెట్ లో హాట్ టాపిక్ అయింది.