: మొన్న బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ... తాజాగా ఒంటె ఫ్లూ!
ఆమధ్య బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ వణికించాయి. తాజాగా గల్ఫ్ దేశాల్లో ఒంటె ఫ్లూ వణుకు పుట్టిస్తోంది. ఈ వ్యాధి బారిన పడి ఇప్పటికే 80 మంది మృత్యువాత పడ్డారు. కడుపునొప్పి, విరేచనాలు ఈ వ్యాధి లక్షణాలని డాక్టర్లు చెబుతున్నారు. ఒంటెల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందని, ఒంటెను తినే వారిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయని వారు వెల్లడించారు. కామెల్ ఫ్లూ గురించి రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. గాంధీ ఆసుపత్రిలో దీనికి సంబంధించి నోడల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.