: పోలియో వాక్సిన్ రూపకర్త కొప్రోవ్ కన్నుమూత


పోలియో నివారణ వాక్సిన్ ను కనుగొని ఎంతోమందిని వైకల్యానికి దూరం చేసిన మహనీయ శాస్త్రవేత్త డాక్టర్ హిల్లరీ కొప్రోవ్ స్కీ 96ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ఇటీవలి కాలంలో కొప్రోవ్ కు క్రమంగా ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. దీంతో న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం, విన్నెవూడ్ లో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు వెల్లడించారు.

కొప్రొవ్ ప్రపంచంలోనే తొలిసారిగా పోలియోను అరికట్టగల ప్రభావవంతమైన వాక్సిన్ ను విస్టర్ ఇనిస్టిట్యూట్ లో రూపొందించారు. ఇది నోటి ద్వారా ఇచ్చేది. అంతేకాదు రేబిస్ వాక్సిన్ ను అభివృద్ధి చేయడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఈయన సేవలను గుర్తిస్తూ ఎన్నో అవార్డులు, పురస్కారాలు వచ్చాయి... ఒక్క నోబుల్ తప్ప!

  • Loading...

More Telugu News