: పార్లమెంటుపై నాటి ఉగ్రదాడి


డిసెంబర్ నెల. చల్లటి వాతావరణం మధ్య పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. సాధారణంగా సామాన్యులు ఎవరూ అటువైపుగా వెళ్లలేరు. అత్యంత ప్రముఖులు సమావేశమయ్యే స్థలం కనుక కట్టు దిట్టమైన భద్రత ఉంటుంది. అడుగడుగుకీ పోలీసులు మోహరించి ఉంటారు. కానీ, భద్రతా సిబ్బందిని ఉగ్రవాదులు తెలివిగా బోల్తా కొట్టించారు. 

పార్లమెంట్ భవనం లోపలికి కేంద్ర హోం శాఖ లోగోతో 
2001, డిసెంబర్ 13న ఓ కారు ప్రవేశించింది. కానీ ఇందులో ఉన్నది కరుడుగట్టిన ఉగ్రవాదులు. లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలన్న హడావుడిలో వారు వేగంగా వచ్చి పార్లమెంట్ ఆవరణలో ఆగివున్న ఉపరాష్ట్ర్రపతి కృష్ణకాంత్ వాహనాన్ని  ఢీకొట్టారు. ఒక్కసారిగా అలజడి రేగింది. ఉపరాష్ట్రపతి వ్యక్తిగత భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు.

కారులో వచ్చింది
గ్రవాదులేనని గ్రహించే లోపే ఐదుగురు ముష్కరులు కారు దిగి కాల్పులు మొదలెట్టారు. భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు ప్రారంభించారు. ముష్కరులందరినీ మట్టుబెట్టారు. అయితే, ఆ లోపే ఉగ్రవాదుల కాల్పుల్లో ఏడుగురు  అసువులు బాశారు. వీరిలో ఐదుగురు పోలీసులు, ఒకరు పార్లమెంట్ సెక్యూరిటీ గార్డు, మరొకరు గార్డెన్ ఉద్యోగి. వాస్తవానికి వీరిలో ఒక ఉగ్రవాది బాంబులతో నింపిన జాకెట్ వేసుకుని వున్నాడు. అంటే అతడి వ్యూహం ప్రకారం పార్లమెంట్ లోపలికి వెళ్లి తనను తాను పేల్చేసుకుని వుంటే భారీ నష్టమే జరిగి వుండేది. 

ఉగ్రవాదులు రాకముందు లోక్ సభ, రాజ్య సభకు 
40 నిమిషాల విరామం ప్రకటించారు. దీంతో ప్రధాని వాజపేయి, ప్రతిపక్ష నేత సోనియాగాంధీ లోక్ సభ నుంచి అప్పటికే వెళ్ళిపోయారు. హోం మంత్రి అద్వానీ తదితరులు పార్లమెంటు భవనం లోపలే వున్నారు. మొత్తానికి భద్రతా సిబ్బంది సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పింది. 

పోలీసులు ఈ దాడి కేసులో దర్యాప్తును వేగంగా పూర్తి చేసి, 2002 మే 14న ప్రత్యేక కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసారు. అందులో పార్లమెంటుపై దాడి వెనుక జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు అఫ్జల్ గురు, షౌకత్ హుస్సేన్, ఎస్ఏఆర్ గిలానీ, నవజ్యోత్ సందు పాత్ర వుందని పేర్కొన్నారు. కోర్టు 
 అఫ్జల్ గురు, షౌకత్ హుస్సేన్, ఎస్ఏఆర్ గిలానీలకు మరణ శిక్ష విధించింది. నవజ్యోత్ సందూకి మాత్రం 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష ఖరారు చేసింది.

తర్వాత హైకోర్టు 
షౌకత్ హుస్సేన్, ఎస్ఏఆర్ గిలానీలకు కూడా మరణ శిక్ష రద్దు చేసి, సాధారణ శిక్షగా మార్పు చేసింది. ఆఖరుకు ఒక్క అఫ్జల్ గురు మాత్రమే మరణ శిక్ష తప్పించుకోలేకపోయాడు. పలు సార్లు క్షమాబిక్ష కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం దక్కలేదు. చివరికి అతడి అభ్యర్ధనను ప్రణబ్ తోసిపుచ్చడంతో అఫ్జల్ గురు చరిత్రలో ఓ రాక్షసుడిగా కలిసిపోయాడు. 

  • Loading...

More Telugu News