: అసోంలో నలుగురు వ్యక్తుల కిడ్నాప్
అసోంలోని బక్సా జిల్లాలో నలుగురు వ్యక్తులు అపహరణకు గురయ్యారు. నిమ్మకాయల వ్యాపారం నిమిత్తం పొరుగు జిల్లా బార్పేట నుంచి సాల్బారి సబ్ డివిజన్ లోని లబ్దాంగురి మార్కెట్ కు శుక్రవారం సాయంత్రం వచ్చిన వీరు తిరిగి ఇళ్లకు చేరుకోలేదు. దీంతో బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు... అపహరణకు గురైన నలుగురిని బోడో తీవ్రవాదులు కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ క్రమంలో సాల్బారి సబ్ డివిజన్ లో కర్ఫ్యూ విధించినట్లు బక్సా అదనపు డిప్యూటీ కమిషనర్ భవానీ ప్రసాద్ శర్మ తెలిపారు. అపహరణకు గురైన నలుగురిలో ఇద్దరు 13 ఏళ్ల వయసున్న బాలలు. ఓ ప్రాంతంలో బాధితులవిగా భావిస్తున్న నాలుగు సైకిళ్లు, నాలుగు జతల చెప్పులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలు బాధితుల ఆచూకీ కోసం ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నాయి.