: రాజ్యసభలో పోలవరం బిల్లును కాంగ్రెస్ అడ్డుకోవాలి: హరీష్ రావు
పోలవరం బిల్లు విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. వారికే గనుక చిత్తశుద్ధి ఉంటే రాజ్యసభలో పోలవరం బిల్లును వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఓపెన్ కాస్ట్ బాధితుల సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ, సమస్యలపై రెవెన్యూ, సింగరేణి అధికారులతో కమిటీ వేస్తామన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని, అక్కడి నిర్వాసితులకు రూ.120 కోట్ల పరిహారం విడుదల చేస్తామని చెప్పారు.