: ఢిల్లీపై పట్టుకు ఆప్ యత్నం


దేశ రాజధాని ఢిల్లీపై తిరిగి పట్టు సాధించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ యత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రత్యేక భేటీల ద్వారా ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మొన్నటి ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ సాధించిన అనూహ్య విజయం సార్వత్రిక ఎన్నికల ఓటమితో ఒక్కసారిగా కనుమరుగైంది. అంతేకాక అందివచ్చిన అవకాశాన్ని చేజేతులా వదులుకున్న వైనంపై ప్రజలు కాస్త వ్యతిరేకంగానే ఉన్న విషయాన్ని పసిగట్టిన ఆప్ నేతలు, ప్రజల్లోని అసంతృప్తిని పారదోలేందుకు అవసరమైన కసరత్తు ప్రారంభించారు. మరోవైపు, పార్టీని పలువురు నేతలు వీడిన వైనం కూడా పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసింది. అయితే, రానున్న ఢిల్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లివ్వడంతో పాటు ఓటమిపాలైన స్థానాల్లో అభ్యర్థులను మార్చనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News