: సూపర్ న్యూమరరీ డీఎస్పీ పోస్టులకు టీ సర్కార్ అనుమతి
తెలంగాణ సర్కారు 134 సూపర్ న్యూమరరీ డీఎస్పీ పోస్టులకు అనుమతి ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒప్పుకున్న ప్రభుత్వం, ప్రమోషన్లు ఇచ్చిన అధికారులను సూపర్ న్యూమరరీ పోస్టుల్లో నియమించే అవకాశం ఉంది. ఈ మేరకు హోంశాఖలో ఇన్ స్పెక్టర్ పోస్టుల స్థానంలో ఈ పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. పోలీసు పదోన్నతుల వివాదం నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.