: కేసీఆర్ సాయిబాబా గుడికెళ్లారు
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సాయిబాబా ఆలయానికి వెళ్లారు. ఇవాళ గురుపౌర్ణమి సందర్భంగా హైదరాబాదు దిల్ సుఖ్ నగర్ లోని షిర్డీ సాయిబాబా సంస్థాన్ కు వెళ్లిన కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎప్పుడూ రాజకీయాల్లో తలమునకలయ్యే కేసీఆర్... రొటీన్ కి భిన్నంగా గుడికి వెళ్లి సాయినాథుడిని దర్శించుకున్నారు. ఆయన వెంట తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కూడా ఉన్నారు.