: భారత్ లో రోడ్ సైడ్ ఫుడ్డే బెటరట!
విభిన్న నేపథ్యం, సంస్కృతుల మేళవింపుతో ప్రత్యేకంగా విరాజిల్లుతున్న భారత్ లో విభిన్న రుచులకూ కొదవేమీ లేదు. అంతేకాదండోయ్.., రూ. 10 జేబులో ఉంటే చాలు కడుపు నింపుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో రూ.1000 లూ ఒక్క భోజనానికి మాత్రమే సరిపోతాయి. అయితే ఖరీదైన భోజనం బెటరా?, రోడ్ సైడ్ లో చకాచకా ఆకలి తీర్చే భోజనం బాగుంటుందా? అన్న ప్రశ్నకు కూడా మనం భిన్నంగానే స్పందిస్తాం. అయితే, భారత్ లోని ఆహార వైవిధ్యంపై నాలుగేళ్ల పాటు విస్తృతంగా పరిశోధన సాగించిన ఆస్ట్రేలియా దేశస్తురాలు ఛార్మైన్ ఓబ్రెయిన్ మాత్రం మన దేశంలోని రోడ్ సైడ్ ఫుడ్ కే తన ఓటని బల్లగుద్ది మరీ చెబుతోంది. రెస్టారెంట్లలో కంటే రోడ్లపై తయారయ్యే ఆహారమే ఆరోగ్యమని కూడా ఆమె తేల్చేసింది. రోడ్ సైడ్ ఫుడ్ మేకింగ్ లో వాడే పదార్థాలన్నీ తాజావేనని, అందుకే ఆరోగ్యకరమని కూడా ఆమె కారణాలతో సహా విశ్లేషిస్తున్నారు.