: అన్నవరం సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న యనమల
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ ఉదయం అన్నవరం సత్యనారాయణస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో రైతు రుణాల రీషెడ్యూల్ కు రిజర్వ్ బ్యాంక్ అంగీకరించిందని చెప్పారు.