: ఈ నెల 15కల్లా పుంజుకోనున్న రుతుపవనాలు: వాతావరణ శాఖ
మధ్య, వాయవ్య భారతదేశంలో ఈ నెల 15కల్లా రుతుపవనాలు పుంజుకోనున్నట్లు ఢిల్లీ వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో బంగాళాఖాతంలో ఒత్తిడి ఏర్పడిందని, అటు ఈ నెల 14 వరకు గాలిలో తేమ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ డైరెక్టర్ బీపీ యాదవ్ తెలిపారు. మేఘాలు లేకపోవడం కారణంగానే ప్రస్తుత వాతావరణం ఇలా ఉందన్నారు.