: తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తాం: డీఎస్
తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి తీవ్రంగా కృషి చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డీఎస్ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలో మాట్లాడిన ఆయన, ఎన్నికల్లో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. కాంగ్రెస్ శ్రేణులతో త్వరలో వర్క్ షాప్ నిర్వహిస్తామని తెలిపారు. కాగా, పోలవరంపై కేంద్రం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. సోనియావల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్న డీఎస్ రాష్ట్ర పర్యటనకు రావాలని సోనియాను కోరతామన్నారు.