: భారత సరిహద్దులో మళ్లీ పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన
భారత సరిహద్దులోని జమ్మూకాశ్మీర్ లో పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. ఆర్ఎస్ పుర సెక్టార్ వద్ద పిండి స్థావరంలో పాక్ సైనిక దళాలు కాల్పులు జరిపాయి. వెంటనే భారత బలగాలు అందుకు దీటుగా బదులిచ్చారు. ప్రస్తుతం ఇరు దేశాల సైనికుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.