: 'హ్యారీ పోటర్' నటుడి అనుమానాస్పద మృతి


హ్యరీ పోటర్ చిత్రంలో వేర్ ఉల్ఫ్ (మానవరూప తోడేలు) పాత్ర పోషించిన బ్రిటిష్ నటుడు డేవిడ్ లెజినో (50) అనుమానాస్పదరీతిలో మరణించాడు. అతను అమెరికా, కేలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో శవమై కనిపించాడు. డెత్ వ్యాలీలోని జెబ్రిస్కీ వద్ద అతని మృతదేహాన్ని కనుగొన్నట్టు స్థానిక పోలీసు అధికారి తెలిపారు. అధిక ఉష్ణోగ్రత కారణంగా అతను మరణించి ఉంటాడని ఆ అధికారి పేర్కొన్నారు. హ్యారీ పోటర్ సిరీస్ లోని 'హ్యారీ పోటర్ అండ్ ద హాఫ్ బ్లడ్ ప్రిన్స్'తో పాటు రెండు భాగాలుగా నిర్మితమైన 'హ్యారీ పోటర్ అండ్ డెత్లీ హాలోస్' సినిమాల్లో లెజినో వేర్ ఉల్ఫ్ పాత్ర పోషించాడు. ఇవేగాక మరికొన్ని హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించాడు. కాగా, అమెరికాలోని డెత్ వ్యాలీ వాస్తవానికి ఎడారి ప్రాంతం. ఎత్తైన ఇసుకదిబ్బలతో నిండి ఉంటుందా ప్రాంతం. ఇక్కడ సాధారణంగా 49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి.

  • Loading...

More Telugu News