: ఇడుపులపాయలో నెల్లూరు పోలీసులు... అదృశ్యమైన జడ్పీటీసీల కోసం రాక


రేపు నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక జరగనున్న తరుణంలో రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో, కడప జిల్లా ఇడుపులపాయలో వైకాపా క్యాంప్ ఏర్పాటు చేసింది. ఈ క్యాంపులో 30 మంది నెల్లూరు జిల్లా జడ్పీటీసీ సభ్యులున్నట్టు సమాచారం. అయితే, ఐదు మంది జడ్పీటీసీలు అదృశ్యమైనట్టు వారి బంధువులు నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ మహిళా జడ్పీటీసీ భర్త కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, ఇడుపులపాయ చేరుకున్న పోలీసులు... జడ్పీటీసీలను విచారిస్తున్నట్టు సమాచారం. పోలీసుల రాక సందర్భంలో, వీరిని వైకాపా శ్రేణులు అడ్డుకున్నాయి.

  • Loading...

More Telugu News