: రాజ్ నాథ్ నివాసం ఎదుట యూపీఎస్సీ ఆశావహుల నిరసన
కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాసం ఎదుట యూపీఎస్సీ ఆశావహులు నిరసన ప్రదర్శనకు దిగారు. సీ-శాట్ (ఆప్టిట్యూడ్ టెస్ట్) రద్దు చేయాలని, 2011 యూపీఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి సడలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రదర్శనకారులను నిలువరించేందుకు పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. యూపీఎస్సీ మాదిరి ప్రశ్నాపత్రాలు, సిలబస్ ఎప్పుడు మారినా వయోపరిమితి కూడా సడలిస్తారని, ఇది యూపీఎస్సీ నిబంధన అని టాన్యా రాణా అనే ఆశావహురాలు పేర్కొంది. 2011లో మాదిరి ప్రశ్నాపత్రాలు మారినా, వయోపరిమితి మాత్రం సడలించలేదని ఆమె ఆరోపించింది.