: మాయన్‌ క్యాలెండర్‌ కచ్చితమైనదే!


మాయన్‌ల కాలజ్ఞానం చెప్పినట్లుగా గత ఏడాది డిసెంబరు 21న యావత్తు ప్రపంచం అంతమైపోలేదు. అయితే.. కొత్తగా దొరుకుతున్న ఆధారాలు మాత్రం.. మాయన్‌ ల క్యాలెండర్‌ వ్యవస్థ చాలా కచ్చితమైనదని నిరూపిస్తున్నాయి. గూటేమాలన్‌ ఆలయంలోని చెక్క దూలాలను మళ్లీ విశ్లేషించడం ద్వారా మాయన్‌ సంస్కృతి వెయ్యి సంవత్సరాల కిందటే నశించిపోయిందని తేల్చారు.

వాతావరణ మార్పులకు అనుగుణంగా లేనందునే అలా జరిగినట్లుగా ఇదివరలో భావించారు. ఈ మధ్య అమెరికా వాసులు నాగరిక సమాజాన్ని, కచ్చితమైన క్యాలెండర్లను, క్లిష్ట నిర్మాణ రీతులను పాటించారు. అయితే.. వర్షాకాలాల్లో వారి మనుగడ బాగానే సాగినప్పటికీ.. క్రీశ 800 నుంచి 1100 లోగా వచ్చిన సుదీర్ఘమైన కరవు వారి జాతులు అంతమైపోవడానికి కారణమైనట్లుగా తేలుస్తున్నారు. చాలాకాలంగా.. నిపుణులు మాయన్‌ ల క్యాలెండర్‌ గణనలను, ఆధునిక యూరోపియన్‌ క్యాలెండర్‌ తో పోల్చి నిగ్గు తేల్చడానికి ప్రయత్నిస్తున్నారు. పెనిసెల్వేనియా యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజిస్టు డగ్లస్‌ కెనెట్‌ ఈ క్యాలెండర్‌లను పోల్చి .. మాయన్‌ సంస్కృతి కాలాన్ని సరిగ్గా లెక్కతేల్చే అధ్యయనాల్లో నిమగ్నమై ఉన్నారు.

  • Loading...

More Telugu News