: నాకూ, షారూఖ్ కు మధ్య విభేదాల్లేవు: అజయ్ దేవగణ్


తనకూ, షారూఖ్ ఖాన్ కు మధ్య ప్రస్తుతం విభేదాలేవీ లేవని బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ అంటున్నారు. అసలు సమస్యలేవీ లేకుండానే తామిద్దరం ఎందుకు ఎడముఖం పెడముఖంగా ఉన్నామో అర్థం కావడంలేదని పేర్కొన్నాడు. షారూఖ్ నటించిన 'జబ్ తక్ హై జాన్'... దేవగణ్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్' సినిమాలు 2012 దీపావళి నాడే విడుదలయ్యాయి. దీంతో, ఈ హీరోలిద్దరి మధ్యా విభేదాలున్నాయని, అందుకే పోటాపోటీగా ఒకే రోజు తమ సినిమాలు విడుదల చేశారని బాలీవుడ్ లో గుప్పుమంది. దీనికి తోడు యశ్ రాజ్ ఫిలింస్... 'జబ్ తక్ హై జాన్' సినిమాకోసం థియేటర్లను గుప్పిటపెట్టుకుందని దేవగణ్ ఆరోపించడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. అయితే, ఇటీవలే 'సింగం రిటర్న్స్' సినిమా త్వరలో విడుదల కానున్న సందర్భంగా ఆ సినిమా హీరో అజయ్ దేవగణ్ కు, దర్శకుడు రోహిత్ శెట్టికి షారూఖ్ శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై, దేవగణ్ స్పందిస్తూ, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటామని, 'సింగం రిటర్న్స్' సినిమాలో షారూఖ్ కొత్త చిత్రం 'హ్యాపీ న్యూ ఇయర్' ప్రోమోను కూడా ప్రదర్శిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News