: గోడ కూలి ఇద్దరు చిన్నారుల మృతి


పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూరల్ మండలం చినమీరం గ్రామంలో ఇంటి గోడ కూలిన ఘటనలో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. దిరుసుమర్రు గ్రామానికి చెందిన లచ్చన్న, మంగ దంపతులు కూలీ పనుల నిమిత్తం నెల క్రితం చినమీరం గ్రామానికి వచ్చారు. శనివారం తెల్లవారుజామున వారు నివసిస్తున్న ఇంటి గోడ ఉన్నట్లుండి కూలిపోయింది. ఈ ప్రమాదంలో వారి పిల్లలిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో లచ్చన్న, మంగ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News