: ఇంగ్లండును ఆదుకున్న రూట్, బ్రాడ్


నాటింగ్ హామ్ లో ఇంగ్లండుతో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు ఆకట్టుకున్నారు. బౌలర్లు భువనేశ్వర్ (4/61), ఇషాంత్ (3/109), షమీ (2/98)ల ధాటికి మూడో రోజు ఇంగ్లండ్ పై భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే, రూట్ (78 బ్యాటింగ్), బ్రాడ్ (47) కీలక ఇన్నింగ్స్ ఆడకపోతే ఇంగ్లండ్ ఫాలో ఆన్ ఉచ్చులో పడుండేది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 9 వికెట్లకు 352 పరుగులు చేసింది. ఇండియాకన్నా ఇప్పటికీ 105 పరుగులు వెనుకబడి ఉంది. రూట్, అండర్సన్ (23) క్రీజులో ఉన్నారు. మూడో రోజును ఇంగ్లండ్ ఓవర్ నైట్ స్కోరు 43/1తో ప్రారంభించింది. రాబ్సన్, బ్యాలెన్స్ జోడీ స్వేచ్ఛగా ఆడుతుండటంతో, కెప్టెన్ ధోనీ ఐదుగురు బౌలర్లను ప్రయోగించాడు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. ఇరువురూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే లంచ్ సెషన్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేవలం 74 పరుగుల తేడాతో ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్రాడ్, రూట్ లు ఇంగ్లండ్ ను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించారు. ఎనిమిదో వికెట్ కు వీరిద్దరూ 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ లలో రాబ్సన్ 59, బ్యాలెన్స్ 71, బెల్ 25, రూట్ 78*, అలీ 14, ప్రయర్ 5, స్టోక్స్ 0, బ్రాడ్ 47, ఫ్లంకెట్ 7, అండర్సన్ 23* పరుగులు చేశారు.

  • Loading...

More Telugu News