: మెదక్ జిల్లాలో రెండు లారీలు ఢీ... ముగ్గురు మృతి
మెదక్ జిల్లా సదాశివపేటలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానిక ఐబీ అతిథి గృహం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు.