: ఖమ్మంలో వామపక్షాల ధర్నా


పోలవరం వ్యవహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై వామపక్షాలు మండిపడ్డాయి. ప్రాజెక్టు నిర్మాణం కోసం తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలపడాన్ని నిరసిస్తూ ఈ రోజు ఖమ్మం బస్ డిపో ఎదుట సీపీఐ, సీపీఎం ధర్నా చేపట్టాయి. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా ఇరుపార్టీల కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. రైతుల ప్రయోజనాల కోసం ఈ చట్టం చేస్తున్నామని కేంద్రం చెబుతోందని... వాస్తవానికి దీని వెనుక బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలు ఉన్నాయని నేతలు ఆరోపించారు. ముంపు ప్రాంతాన్ని తగ్గించేందుకు ప్రాజెక్టు డిజైన్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News