: ‘స్కాడా’ పథకం పైలట్ ప్రాజెక్టు కోసం ఏపీలోని నాలుగు జిల్లాలు ఎంపిక


విద్యుత్ నష్టాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘స్కాడా’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభిస్తోంది. అందుకోసం రూ.100 కోట్ల నిధులను కేంద్ర ఇంధన వనరుల శాఖ కేటాయించింది. ఈ పథకానికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు జిల్లాలను ఎంపిక చేశారు. విజయవాడ, గుంటూరు, విశాఖ, నెల్లూరు జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టినట్లు కేంద్ర ఇంధన వనరుల శాఖ తెలిపింది.

  • Loading...

More Telugu News