: గుజరాత్ మోడల్ రాష్ట్రం కాదు...నేరాల రాష్ట్రం: శైలేష్ పర్మార్
అందరూ అనుకునేలా గుజరాత్ రాష్ట్రం మోడల్ రాష్ట్రం కాదని, నేరాలకు నిలయంగా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే, గుజరాత్ లో ఆ పార్టీ అధికార ప్రతినిధి శైలేష్ పర్మార్ ఆరోపించారు. గాంధీనగర్ లో ఆయన మాట్లాడుతూ, గుజరాత్ లో నేర ప్రవృత్తి నెమ్మదిగా పెరుగుతోందని అన్నారు. గుజరాత్ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా పేర్కొనేవారని, అలాంటి గుజరాత్ నేరమయమైందని ఆయన అభిప్రాయపడ్డారు. గుజరాత్ లో శాంతి భద్రతలు పూర్తిగా గాడితప్పాయని ఆయన ఆరోపించారు. గత 17 ఏళ్ల బీజేపీ పాలన పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని ఆయన ఆరోపించారు. కావాలంటే జాతీయ నేర రికార్డుల బ్యూరో గణాంకాలు చూడాలని ఆయన సూచించారు.