: కెనడియన్ చిత్రానికి నిర్మాతగా సల్మాన్
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ త్వరలో ఓ కెనడియన్ ఆఫ్ బీట్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. సల్మాన్ ఆధ్వర్యంలోని 'బీయింగ్ హ్యూమన్' ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'డాక్టర్ కాబి' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జీన్-ఫ్రాంకోయిస్ పౌల్లిట్ దర్శకత్వం వహిస్తున్నాడు. కారు డ్రైవర్ గా మారిన నిరుద్యోగ వైద్యుడి జీవిత చిత్రాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. దీనిపై సల్మాన్ మాట్లాడుతూ.. భారతీయ వలసదారుడైన 'డాక్టర్ కాబి' గురించిన చిత్ర కథగా ఇది సాగుతుందని తెలిపాడు. గతంలో సల్లూ 'చిల్లార్ పార్టీ' చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించాడు.