: మహాత్మాగాంధీ హత్య కేసు ఫైళ్లు భద్రంగానే ఉన్నాయి: రాజ్ నాథ్ సింగ్
ఇటీవల తమ శాఖ చేపట్టిన 'క్లీనింగ్ డ్రైవ్' లో ఎలాంటి చారిత్రాత్మక ఫైళ్లను పడేయలేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. వాటిలో ప్రధానంగా మహాత్మాగాంధీ హత్య కేసుకు సంబంధించిన ఫైళ్లే భద్రంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ మేరకు రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్న సందర్భంగా హోంమంత్రి పైవిధంగా తెలిపారు. కేవలం అనవసరమైన, ఎలాంటి డాక్యుమెంటరీలేని, చారిత్రక విలువలేని 11,100 ఫైళ్లను మాత్రం ప్రభుత్వం తీసేసినట్లు వివరించారు.