: 'సీబీఐ'కి భయపడను: ధర్మాన ధీమా


వాన్ పిక్ కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు ఏమంటున్నారో వినండి. సీబీఐ కేసులకు భయపడేదిలేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేనా, తాను ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోతానని చెబుతున్నారు. పైగా, ప్రజల్లో తనకు ప్రజాదరణ విశేషంగా పెరిగిందని మురిసిపోతున్నాడీ మంత్రివర్యుడు. ఈరోజు శ్రీకాకుళంలో జరిగిన ఓ కార్యక్రమంలో ధర్మాన పాల్గొన్నారు. కాగా, నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వాన్ పిక్ కేసులో నిందితులంతా జైలులో ఉంటే ఓ వ్యక్తి మాత్రం బయటున్నాడని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News