: సికింద్రాబాదులో పేకాటకు ‘పేకప్’ చెప్పారు
సికింద్రాబాదులోని వారాసిగూడలో 23 మంది జూదరులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, వ్యాపారస్తులతో పాటు ప్రభుత్వోద్యోగులు ఉన్నారు. వారి నుంచి రూ.7.5 లక్షలు, 23 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులోని పేకాట క్లబ్బులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి.