: తమిళనాడులో 2,176 పాలిటెక్నిక్ సీట్లు ఖాళీగా ఉన్నాయ్
తమ రాష్ట్రంలో 2,176 పాలిటెక్నిక్ సీట్లు ఖాళీగా ఉన్నాయని తమిళనాడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పళనియప్పన్ చెప్పారు. పాలిటెక్నిక్ కోర్సులో చేరగోరేవారు తమ రాష్ట్రానికి రావాలని ఆయన చెప్పకనే చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 5,980 సీట్లు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన తమిళనాడు అసెంబ్లీలో ప్రకటించారు.