: మిశ్రా నియామకంపై లోక్ సభలో రగడ


ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య కార్యదర్శిగా ట్రాయ్ మాజీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా నియామక అంశంపై శుక్రవారం లోక్ సభ అట్టుడికింది. ట్రాయ్ చైర్మన్ లేదా సభ్యులు పదవీ విరమణ తర్వాత అటు కేంద్రంలో గాని ఇటు రాష్ట్రాల్లో గాని ఎలాంటి అధికార పదవి పొందేందుకు అర్హలు కాదని 1997 నాటి ట్రాయ్ బిల్లు చెబుతోంది. మిశ్రా ట్రాయ్ చైర్మన్ గా పనిచేశారు. నిబంధనల మేరకు ఆయన ఎలాంటి అధికార పదవి చేపటట్టేందుకు అర్హులు కారు. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ ఏరికోరి మరీ మిశ్రాను తన కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా నియమించుకున్నారు. ఈ నియామకానికి అడ్డంకిగా నిలుస్తున్న ట్రాయ్ బిల్లును సవరిస్తే కాని పని కాదు మరి. మోడీ సర్కారు కూడా అదే చేసింది. ఈ నేపథ్యంలో, కేవలం ఒక్క అధికారి కోసం ఏకంగా ట్రాయ్ బిల్లుకే సవరణ చేస్తారా? అంటూ విపక్షాలు కాస్త గట్టిగానే ప్రభుత్వాన్ని నిలదీశాయి. దీంతో ఎలాగైనా సవరణ బిల్లుకు ఆమోద ముద్ర వేయించుకునేందుకు బీజేపీ తన సభ్యులకు విప్ జారీ చేసింది. దీనిపై తృణమూల్ కాంగ్రెస్, ఆప్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు.

  • Loading...

More Telugu News