: ఎ4 నిందితురాలికి పోలీసులు సెల్యూట్ ఎలా చేస్తారు?: నారాయణ


రాష్ట్ర మంత్రుల పేర్లు సీబీఐ ఛార్జిషీటులో చోటు చేసుకోవడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఘాటుగా స్పందించారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఏ4 నిందితురాలిగా ఉన్న రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పోలీసులు ఎలా సెల్యూట్ చేస్తారని నారాయణ ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. కళంకిత మంత్రి సబితను ఇకనైనా క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. ఇక జగన్ గురించి మాట్లాడుతూ, అతనో ఆర్ధిక, రాజకీయ నేరస్తుడని పేర్కొంటూ, అలాంటి వ్యక్తి వద్దకు పలువురు వెళ్ళి బి-ఫారాల కోసం దేబిరించడం దారుణమని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News