: పోలవరంపై సుప్రీంను ఆశ్రయించనున్న తెలంగాణ


కేంద్ర ప్రభుత్వం పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలపడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు న్యాయపోరాటం చేసేందుకు సన్నద్ధమౌతోంది. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుందని సమాచారం. ఈ మేరకు పోలవరం, నీటిపారుదల అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మంత్రి హరీష్ రావు, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News