: ముంబయి ఇండియన్స్ హ్యాట్రిక్


ముంబయి ఇండియన్స్ జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈరోజు సాయంత్రం పుణే వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ 41 పరుగులతో జయభేరి మోగించింది. 184 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ఆరంభించిన పుణే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులే చేయడంతో ఓటమితప్పలేదు. ముంబయి పేసర్ మిచెల్ జాన్సన్ (3 వికెట్లు ) ఆరంభంలోనే దెబ్బతీయడంతో పుణే ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. పుణే జట్టులో మార్ష్ (38) టాప్ స్కోరర్.

  • Loading...

More Telugu News