: క్లర్కుల్లా గవర్నర్లు ట్రాన్స్ ఫర్ కాకూడదు: నాగాలాండ్ మాజీ గవర్నర్
ఎలాంటి సమాచారం లేకుండా తనను మిజోరాం గవర్నర్ గా కేంద్ర ప్రభుత్వం బదిలీ చేయడంపై నాగాలాండ్ మాజీ గవర్నర్ బి.పురుషోత్తమ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉదయం రాజీనామా అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తాను బదిలీ అయిన విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంలో కేంద్రం తనను ఏమాత్రం సంప్రదించలేదన్నారు. గవర్నర్ పదవి రాజ్యాంగ పదవి అని, ప్రతిసారీ గుమాస్తాల్లా, దిగువ స్థాయి అధికారుల్లా బదిలీకాకూడదని అభిప్రాయపడ్డారు. యూపీఏ లేదా ఎన్డీఏ ఇలా ఏ ప్రభుత్వ పాలనలోనూ జరగకూడదని, సరైంది కాదని ఆయన పేర్కొన్నారు.