: రాష్ట్ర విభజనతో సినీ పరిశ్రమకు నష్టం లేదు: నిర్మాత సురేష్ బాబు


రాష్ట్ర విభజన వల్ల సినీ పరిశ్రమకు నష్టం లేదని నిర్మాత డి.సురేష్ బాబు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో షూటింగ్ కు అనువైన ప్రదేశాలు ఉన్నాయన్నారు. విజయవాడ కనకదుర్గమ్మను ఈ రోజు సురేష్ బాబు దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, భవిష్యత్తులో తెలుగు సినిమా పరిశ్రమకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News