: చట్టపరమైన నిబంధనలు అనుసరించే ఉరి అమలు : షిండే
పార్లమెంటుపై దాడి కేసులో కీలక దోషి అఫ్జల్ గురుకు ఈ ఉదయం 8 గంటలకు తీహార్ జైల్లో ఉరిశిక్షను అమలు చేసామని హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. డిల్లీలో మీడియాతో మాట్లాడిన షిండే, జనవరి 21న రాష్ట్రపతికి అఫ్జల్ క్షమాభిక్ష పిటిషన్ ను పంపామనీ, దాన్ని రాష్ట్రపతి తిరస్కరించడంతో ఉరిశిక్ష అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. చట్టపరమైన నిబంధనలు పాటించే అఫ్జల్ ను ఉరి తీసినట్లు వెల్లడించారు. ఈ మేరకు అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు షిండే తెలిపారు.