: ప్రపంచంలో 'అత్యధిక జనాభా గల రెండో నగరం'గా ఢిల్లీ


2014లో ప్రపంచంలో అత్యధిక జనాభా గల రెండో నగరంగా దేశ రాజధాని ఢిల్లీ నిలిచింది. 2.50 కోట్ల జనాభాతో ఢిల్లీ ఈ స్థానాన్ని ఆక్రమించింది. ప్రథమ స్థానాన్ని 3.60 కోట్ల జనాభాతో జపాన్ రాజధాని టోక్యో ఆక్రమించిందని ఐక్యరాజ్య సమితి నివేదిక తెలిపింది. ఇలా ఈ రెండు నగరాలు 2030 వరకు కొనసాగుతాయని తెలిపింది. ఈ మేరకు నిన్న (గురువారం) 'వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్స్' ఈ వివరాలను విడుదల చేసింది. భారత ఆర్థిక రాజధాని ముంబయి ఈ నివేదికలో ఆరవ స్థానంలో నిలిచింది. అటు 2050 కల్లా చైనా కంటే ఎక్కవగా భారత్ లో పట్టణ జనాభా అత్యధిక సంఖ్యలో ఉండే అవకాశం ఉందని వివరించింది.

  • Loading...

More Telugu News